Donald Trump : ధరలు తగ్గిస్తే సరి .. లేదంటే తప్పదు . డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రోజుకో బాంబు పేలుస్తున్నారు. తాజాగా ఆయన దృష్టి ఫార్మా కంపెనీల (Pharma companies) పై పడింది. ఈ కంపెనీలు అమెరికా (America ) లో ఔషధాల ఉత్పత్తి పెంచి ధరలు తగ్గించాలని కోరారు. లేకపోతే భారీ సుంకాల పోటు తప్పవని హెచ్చరించారు. ప్రారంభంలో ఈ సుంకాల పోటు కొద్ది స్థాయిలోనే ఉంటుంది. ఏడాది, ఏడాదిన్నర తర్వాత ఇది 150 శాతం, ఆ తర్వాత 250 శాతం వరకు ఉంటుంది అని ట్రంప్ స్పష్టం చేశారు. మిగతా అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే అమెరికాలో ఔషధాల ధరలు (Drug prices) మూడింతలు ఎక్కువగా ఉన్నందున, వాటి ధరలు తగ్గించక తప్పదని ట్రంప్ ఈ ఏడాది మార్చిలో హెచ్చరించిన విషయం తెలిసిందే.