Cryptocurrency :క్రిప్టో కరెన్సీకి జాతీయస్థాయి ప్రాధాన్యం .. ట్రంప్ యోచన!

అమెరికా తదుపరి అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో క్రిప్టోకరెన్సీ (Cryptocurrency) బిట్‌కాయిన్ జోరు మీదుంది. క్రిప్టోకరెన్సీ కి అనుకూలంగా ట్రంప్ (Trump)ప్రభుత్వ నిర్ణయాలు ఉండొచ్చన్న అంచనాలతో దీని విలువ రికార్డు స్థాయిలో పెరుగుతోంది. ఈ క్రమంలో అమెరికా జాతీయ ప్రాధాన్యత అంశంగా క్రిప్టో కరెన్సీని మార్చేదిశగా ట్రంప్ ఉత్తర్వులు ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. జవనరి 20న అమెరికా అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత క్రిప్టోపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే క్రిప్టో రంగానికి సంబంధించిన విధివిధానాల నిమిత్తం క్రిప్టో కరెన్సీ అడ్వైజరీ కౌన్సిల్ (Advisory Council )ను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.