Nasscom : భారత ఐటీ పై ట్రంప్ ప్రభావం ఉండదు

హెచ్1బీ వీసాల వల్ల అమెరికా దేశానికే మేలు జరుగుతుందని, అక్కడ ఉన్న కీలక నైపుణ్య అంతరాన్ని పూడ్చడానికి ఆ వీసాలపై వెళ్లేవారు సహకరిస్తున్నారని ఐటీ పరిశ్రమ సంఘం నాస్కామ్ పేర్కొంది. అమెరికా ఆర్థిక వృద్ధికి సాంకేతికత కీలకమని గుర్తు చేసింది. హెచ్1బీ వీసా (H1B visa )లపై వెళ్లే సిబ్బంది చాలా తక్కువ వేతనాలకు పనిచేస్తారని, అమెరికా నిపుణులకు చెందాల్సిన ఉద్యోగాలను భర్తీ చేస్తారని, అమెరికాలో వేతనాలు తగ్గేందుకు కారణమవుతున్నారని అనుకోవడం కేవలం భ్రమ అని నాస్కామ్ వైఎస్ ప్రెసిడెంట్ శివేంద్ర సింగ్ (Shivendra Singh) అభిప్రాయపడ్డారు. అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజా చర్యలు ఆదేశాల వల్ల అమెరికా వెళ్లే భారతీయ ఐటీ నిపుణులపై ప్రభావం పడుతుందన్న ఆందోళనలను ఆయన కొట్టిపారేశారు.