ప్రతీచోట క్లౌడ్ సేవలు అందుబాటులో .. సత్య నాదెళ్ల
క్లౌడ్ సేవల విస్తరణ అంతటా పెద్ద ఎత్తున జరుగుతున్నదని మైక్రో సాఫ్ట్ చైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల తెలిపారు. ఈ క్రమంలో క్లౌడ్ కంప్యూటింగ్దే భవిష్యత్తు అని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం భారత్లో పర్యటిస్తున్న ఈ హైదరాబాద్ టెక్నాలజీ దిగ్గజం ముంబైలో జరిగిన మైక్రోసాఫ్ట్ ప్యూచర్ రెడీ లీడర్షిప్ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భగా మాట్లాడుతూ క్లౌడ్, కృత్రిమ మేధస్సు (ఏఐ) కీలకమన్నారు. ఆర్థికాభివృద్ధిలో ఈ రెండు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకొన్నాయన్నారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా 60కి పైగా రీజియన్లలో, 200 లకు పైగా డాటా సెంటర్లలో పెట్టుబడులు పెడుతున్నట్టు స్పష్టం చేశారు. ప్రతీచోట క్లౌడ్ సేవలు అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు తెలిపారు.






