గత ఏడాదితో పోలిస్తే 2023 మరింత కఠినం ..వార్నింగ్ ఇచ్చిన ఐఎంఎఫ్ ఎండీ
ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది మూడోవంతు దేశాల్లోని ఆర్థిక వ్యవస్థలు డీలాపడనున్నట్లు అంతర్జాతీయ ద్రవ్య నిధి హెచ్చరికలు జారీ చేసింది. మూడో వంతు దేశాలన్ని ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడనున్నట్లు ఐఎంఎఫ్ హెడ్ క్రిస్టలీనా జార్జీవా తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే, 2023 మరింత కఠినంగా సాగనున్నట్లు ఆమె తెలిపారు. అమెరికా, యూరోపియన్ దేశాలతో పాటు చైనాలోనూ ఆర్థిక వ్యవస్థలు మరీ నెమ్మదిగా సాగుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఉక్రెయిన్ యుద్ధం, అధిక ధరలు వడ్డీ రేట్లు, చైనాలో మళ్లీ కోవిడ్ లాంటి పరిస్థితులు అనేక దేశాల్ని ఇబ్బంది పెడుతున్న విషయం తెలిసిందే. ఆర్థిక మాంద్యం లేని దేశాల్లో కూడా ఈ ఏడాది లక్షలాది మంది ఆ ప్రభావానికి లోనయ్చే ఛాన్సు ఉందన్నారు.






