ట్విట్టర్ లో కీలక మార్పులు… త్వరలోనే అందుబాటులోకి!
ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ ను ఎలాన్ మస్క్ సొంతం చేసుకున్న తర్వాత ఎలాంటి మార్పులు చోటు చేసుకోనున్నాయనే విషయంపై యూజర్లలో ఆసక్తి నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ట్విట్టర్లో కీలక మార్పులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయని మస్క్ ప్రకటించారు. వచ్చే వారంలోపే ఇవి మొదలవుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా రికమెండెడ్ ఫాలోడ్ ట్వీట్లను అటూ ఇటు తేలికగా కదల్చడం, యూజర్ ఇంటర్ఫేస్లో మార్పులు, ట్వీట్ వివరాల కోసం బుక్ మార్క్ బటన్, ట్వీట్లలో అక్షరాల సంఖ్య పెంచడం వంటి సౌలభ్యం ట్విటర్లో కల్పించనున్నట్లు వెల్లడిరచారు.






