ఉద్యోగులకు టెస్లా షాక్…… అమెరికాలోని ఆఫీసును కూడా
టెస్లా యాజమాన్యం 229 మంది ఉద్యోగులను తొలగించింది. ఆటోపైలట్ టీమ్ నుంచి ఉద్యోగులను తప్పించడంతో పాటు అమెరికాలోని ఒక ఆఫీసును కూడా క్లోజ్ చేసింది. కాలిఫోర్నియాలో ఓ రెగ్యూలేటరీ ప్రకారం శాన్మెట్ ఆఫీసులో 276 వర్కర్లు ఉండేవారు. మిగిలిన ఉద్యోగులైన 47 మందిని టెస్లా బఫెలో ఆటోపైలట్ ఆఫీసుకు పంపించారు. చాలా మంది ఉద్యోగులు తక్కువ నైపుణ్యం కలవారు, తక్కువ శాలరీల వారు అంటే ఆటోపైలట్ డేటా లేబులింగ్ లాంటి పనిచేసేవారే. టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ గత నెలలో ప్రకటించిన 10 శాతం కాస్ట్ కటింగ్ లో భాగంగానే ఈ తొలగింపులు జరిగాయని అంటున్నారు. ఉద్యోగులను తొలగించిన తర్వాత టెస్లా ఉద్యోగుల సంఖ్య 3.5 శాతం తగ్గనున్నాయి. గత నెలలో కూడా టెస్లా ఉద్యోగులను విధుల్లో నుంచి తప్పించింది. వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాదుల బృందం యుఎస్ కోర్టు నుండి అత్యవసర రక్షణను కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. లేఆప్ ల సమయంలో ఫెడరల్ చట్టం ప్రకారం అవసరమైన 60 రోజులు ముందస్తు నోటీసులు కంపెనీ అందించలేదని ఫిర్యాదుదారులు ఆరోపించారు.






