Samsung: సామ్‌సంగ్‌తో ఎలన్ మస్క్ భారీ ఒప్పందం

టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ (Elon Musk ) దిగ్గజ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల కంపెనీ సామ్‌సంగ్ (Samsung) తో కీలక ఒప్పందం కుదుర్చుకున్నారు. తన కార్లకు కావాల్సిన చిప్స్ (Chips) కోసం 16.5 బిలియన్ డాలర్ల ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇది నష్టాల్లో ఉన్న దక్షిణ కొరియా (South Korea) టెక్ దిగ్గజం సామ్‌సంగ్ తయారీ వ్యాపారానికి మద్దతును అందించనుంది. ఈ ఒప్పందంలో కొత్త టెక్సాస్ ఫ్యాబ్ టెస్లాకు చెందిన ఎఐ6 చిప్‌ను తయారు చేసి సామ్‌సంగ్ ఇవ్వనుంది. ఈ ఒప్పందం 2033 వరకు కొనసాగనుంది.