Tesla : టెస్లాకు భారీ జరిమానా విధించిన ఫ్లోరిడా కోర్టు

అమెరికాకు చెందిన దిగ్గజ ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ సంస్థ టెస్లా (Tesla ) కు భారీ జరిమానా పడిరది. 2019 నాటి రోడ్డు ప్రమాదం కేసులో టెస్లా కారులోని ఆటో పైలట్ వ్యవస్థ తప్పిదమే ప్రమాదానికి కారణమని ఫ్లోరిడా కోర్టు (Florida court) నిర్ధారించింది. దీంతో బాధితులకు 242 మిలియన్ డాలర్ల పరహారం ( భారత కరెన్సీలో దాదాపు రూ.2,100 కోట్లు) చెల్లించాలని కంపెనీని ఆదేశించింది. నాటి ప్రమాదంలో ఓ యువతి మృతి చెందగా మరో వ్యక్తి గాయపడ్డారు.
2019లో ఫ్లోరిడాలోని కీ లార్గో (Key Largo ) లో ఈ ఘటన చోటుచేసుకుంది. జార్జ్ మెక్‌గీ (George McGee) అనే వ్కక్తి తన టెస్లా కారులో వెళ్తూ అధునాతన ఆటోఫైలట్ ఫీచర్‌ను ఉపయోగించాడు. ఇది టెస్లా అందించిన ఆటోమేటెడ్ డ్రైవింగ్ వ్యవస్థ. మార్గమధ్యలో తన మొబైల్ ఫోన్ (mobile phone) కారులో కింద పడిపోయింది. ఎలాగూ కారు ఆటోపైలట్ మోడ్‌లో ఉందని భావించిన జార్జ్ కిందకు వంగి ఫోన్ తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనలో ఓ 22 ఏళ్ల యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆమె స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు యువతి మృతదేహం 75 అడుగుల దూరంలో ఎగిరిపడిరది. ఈ ఘటనపై బాధిత కుటుంబాలు కోర్టును ఆశ్రయించాయి. దీనిపై సుదీర్ఘ విచారణ తర్వాత తాజాగా ఫ్లోరిడా కోర్టు తీర్పు వెలువరించింది.