టెక్ దిగ్గజం డెల్ మరోసారి.. లేఆఫ్స్

టెక్ దిగ్గజం డెల్ తాజాగా మరోసారి లేఆఫ్స్ ప్రకటించింది. రేపటి నుంచి ప్రపంచవ్యాప్తంగా 12,500 లేదా అంతకన్నా ఎక్కువ మంది ఉద్యోగుల్ని తొలగించబోతోంది. ఇది ఆ కంపెనీ మొత్తం వర్క్ ఫోర్సులో దాదాపుగా 10 శాతం ఉద్యోగులు ప్రభావితం కాబోతున్నారు. తన కొత్త ఆఒ`ఫోకస్డ్ యూనిట్ కోసం పునర్నిర్మాణ ప్రణాళికలను అమలు చేయడం కోసం ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. డెల్ ఉద్యోగుల తొలగింపు రేపటి నుంచి ప్రారంభమవుతాయని, ఈ వారం వరకు కొనసాగొచ్చని తెలుస్తోంది. ఇప్పటికే కంపెనీ గత ఏడాది నుంచి దాదాపు 13,000 మంది ఉద్యోగుల్ని తొలగించింది. తాజా లేఆఫ్స్ రెండోసారి. ఇంటెల్ తమ సంస్థలో పనిచేస్తున్న 15,000 మందిని తొలగించిన తర్వాత వచ్చిన తాజా లేఆఫ్ డెల్ సంస్థదే.