ఉద్యోగులకు టాటా షాక్!
అతిపెద్ద వాహన తయారీ సంస్థ టాటా మోటర్స్ తన ఉద్యోగులకు చేదు వార్త అందించింది. అమ్మకాలు లేక ఆదాయాలు క్షీణించి ఇబ్బందులు పడుతున్న సంస్థ టర్నరౌండ్ ప్రణాళిక, ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగా స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని (విఆర్ఎస్) ప్రకటించింది. దాదాపు 42,597 మంది ఉద్యోగులను ఇంటికి పంపించనుంది. సంస్థ మొత్తం ఉద్యోగులలో సగం మంది వీఆర్ఎస్ పథకానికి అర్హులని తాజా అంచనా ద్వారా తెలుస్తోంది. నాలుగేళ్లలో మూడోసారి వీఆర్ఎస్ పథకాన్ని టాటా మోటార్స్ ప్రకటించడం గమనార్హం.
తాజా ప్రకటన ప్రకారం ఐదేళ్ళు లేదా అంతకంటే ఎక్కువ కాలంలో సంస్థలో పనిచేసినవారు ఈ పథకానికి అర్హులు. ఉద్యోగి, వయసు, సంస్థలో వారి సర్వీసు ఆధారంగా పరిహారాన్ని లెక్కించనున్నారు. అర్హత గల ఉద్యోగులు డిసెంబర్ 11 నుండి జనవరి 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.






