SBI :ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. త్వరలోనే ఆ సేవలు బందు

ప్రభుత్వరంగానికి చెందిన బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) తన యూజర్లకు అలర్ట్ చేసింది. యూజర్ల భద్రతను దృష్టిలో ఉంచుకొని కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఆండ్రాయిడ్ (Android)11, అంత కంటే తక్కువ వెర్షన్ మొబైల్స్‌లో యోనో సేవల్ని (YONO Services) నిలిపి వేయనుంది. ఆండ్రాయిడ్ 11, అంత కంటే పాత వెర్సన్ వాడుతున్న స్టేట్ బ్యాంక్ కస్టమర్లకు సందేశాలు పంపుతోంది. యూజర్ల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరి 28లోపు పాత వెర్షన్ ఫోన్లు వాడుతుంటే వారు ఆండ్రాయిడ్ 12 అంత కంటే కొత్త వెర్షన్‌కు అప్‌గ్రేడ్ అవ్వాల్సి ఉంటుంది. లేకపోతే యోనో సేవలు నిలిచిపోతాయని స్పష్టం చేసింది.