Reliance:మరోసారి సత్తా చాటిన రిలయన్స్ …దేశీయ సంస్థల్లో

దేశీయ కుబేరుడు ముకేశ్ అంబానీ (Mukesh Ambani ) కి చెందిన రిలయన్స్ (Reliance) ఇండస్ట్రీస్ మరోసారి సత్తా చాటింది. ఈ ఏడాదికి దేశీయ సంస్థల్లో రిలయన్స్ మళ్లీ తొలిస్థానంలో నిలిచినట్టు ఫార్చ్యూన్ గ్లోబల్ (Fortune Global) 500 తాజాగా విడుదల చేసిన జాబితాలో వెల్లడించింది. చమురు నుంచి టెలికాం (Telecom) రిటైల్ రంగం దాకా సేవలు అందిస్తున్న రిలయన్స్, ఈసారి 88వ స్థానం దక్కించుకున్నది. 2024లో లభించిన 86వ స్థానంతో పోలిస్తే రెండు ర్యాంక్‌లు దిగజారింది. అయినప్పటికీ గడిచిన నాలుగేండ్లలో సంస్థ ర్యాంక్ 67 స్థానాలు ఎగబాకింది. 2021లో 155వ స్థానంలో ఉన్నది.