Ratan Tata: రతన్ టాటా డ్రీం కారు మార్కెట్ లోకి..? టాటా మోటార్స్ ఘన నివాళి
టాటా(Tata) మాజీ చైర్మన్ దివంగత రతన్ టాటా మరో కల నెరవేరే దిశగా అడుగులు పడుతున్నాయి. 2019 జెనీవా మోటార్ షో, 2020 ఆటో ఎక్స్ పో లో ఆయన ఎలక్ట్రిక్ వెహికల్ (EV) ఆల్ట్రోజ్ అనే కారును ప్రపంచానికి పరిచయం చేసారు. ఈ కారు విషయంలో టాటా మోటార్స్ అనేక సవాళ్లను ఎదుర్కోవడంతో మార్కెట్ లోకి ఆ కారు అడుగు పెట్టలేదు. కారు కింద భాగంలో బ్యాటరీ ఉంచడం ఈ కారుకు పెద్ద సమస్యగా మారింది. ఫ్లోర్ బోర్డ్ కింద బ్యాటరీని ఏర్పాటు చేయడానికి గ్రౌండ్ క్లియరెన్స్ ను తగ్గించాలి లేదా పెంచాల్సి ఉంటుంది.
సాంకేతిక కారణాల వల్ల రెండు సమస్యలు పరిష్కారం కాలేదు. కంపెనీ ఈ సమస్యతో ఇబ్బంది పడింది. అనేక సార్లు ప్రయోగాలు చేసినా సరే అది సాధ్యం కాలేదు. ఆల్ట్రోజ్ కారు ఆలోచన వెనుక ఉన్న వ్యక్తి రతన్ టాటా. దీనితో టాటా మోటార్స్ ఎలాగైనా సరే ఆ కారును మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. రతన్ టాటా అనారోగ్యం కారణంగా మరణించడంతో ఈ కారు ఇక మార్కెట్ లోకి వచ్చే అవకాశం లేదని అందరూ భావించారు. కాని ఎట్టకేలకు కారును మార్కెట్ లోకి ప్రవేశపెట్టేందుకు టాటా మోటార్స్ కీలక అడుగులు వేసింది.
బ్యాటరీ సమస్యకు టాటా మోటార్స్ పరిష్కారం కనుక్కుందని జాతీయ మీడియా వెల్లడించింది. Punch.ev ఆధారంగా Altroz.ev కారును అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తోంది. టాటా మోటార్స్ Punch.ev లో బ్యాటరీ ప్యాక్ తో సమస్యలు లేవు. దీనితో త్వరలోనే దీనిపై వర్క్ చేయనుంది టాటా మోటార్స్. టాటా మోటార్స్ ఇటీవల ప్రారంభించిన ఆల్ట్రోజ్ ఫేస్ లిఫ్ట్ లో ఉపయోగించిన డిజైన్‌ను Altroz.ev కి వాడే విధంగా అడుగులు వేస్తోంది. ఈ కారును ఎలాగైనా మార్కెట్ లోకి తీసుకొచ్చి రతన్ టాటాకు ఘన నివాళి అర్పించాలని భావిస్తోంది.








