బంగారు బికినీ… వేలంలో రూ.1.46 కోట్లు!

ప్రఖ్యాత డిజైనర్ రిచర్డ్ మిల్లర్ డిజైన్ చేసిన బికినీ వేలంలో రూ.1.46 కోట్లు పలికింది. 1983లో విడుదలైన స్టార్ వార్స్ చిత్రంలో దీనిని హాలీవుడ్ నటి క్యారీ ఫిషరీ ధరించారు. తాజాగా అమెరికాలోని హెరిటేజ్‌లో నిర్వహించిన వేలంలో ఈ బికినీ రూ.1.46 కోట్లు ధర పలికినట్లుగా నిర్వాహకులు వెల్లడిరచారు. 2016లో ఇచ్చిన ఓ ఇంటర్వూరలో క్యారీ ఫిషర్ ఈ బికినీ గురించి మాట్లాడుతూ దర్శకుడు తనకు బంగారంతో చేసిన బికినీ గురించి చెప్పినప్పుడు తమాషా చేస్తున్నారని అనుకున్నానని అన్నారు. డిజైనర్ లోపల భాగంలో మృదుమైన పదార్థం ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. అదే సంవత్సరంలో ఆమె గుండె సంబంధిత వ్యాధితో మృతి చెందారు.