ఆ దేశంలో ఎక్స్ సేవలు నిలిపివేత

దక్షిణ అమెరికా దేశం వెనిజువెలాలో 10 రోజుల పాటు ఎక్స్ సేవలు నిలిపివేశారు. గురువారం నుంచి పది రోజుల పాటు సామాజిక మాధ్యమం ఎక్స్ ( గతంలో ట్విట్టర్) పై నిషేధం విధిస్తున్నట్లుగా వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మడురో ప్రకటించారు. ఎన్నికల అనంతరం హింస చెలరేగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. సోషల్ మీడియా కారణంగా దేశంలో అశాంతి, అంతర్యుద్ధం చెలరేగుతోందని మడురో ఆరోపించారు. టెలిగ్రామ్‌కు అనుకూలంగా ఉండే మెటా యాజమాన్యంలోని వాట్సాప్‌ను సైతం వాడొద్దని మడురో తన మద్దతుదారులను కోరినట్లు తెలుస్తోంది. దీనివల్ల సైనికులు, పోలీసులు ఉన్నతాధికారుల సమాచారం తీసుకొని వారి కుటుంబాలపై బెదిరింపులకు పాల్పడే అవకాశం ఉందని తెలిపారు. కాగా ఆయన వ్యాఖ్యలను వాట్సాప్ యాజమాన్యం ఖండిరచింది.