Emirates Airlines: ఎమిరేట్స్ విమానాల్లో తెలుగు.. సూపర్ అంటున్న ప్రయాణికులు!

మధ్యప్రాచ్యంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ (Emirates Airlines) కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు (Telugu), కన్నడ (Kannada) వంటి భాషలకు అరుదైన గౌరవం అందించింది. హైదరాబాద్, బెంగళూరు నుంచి దుబాయ్ వెళ్లే ఎమిరేట్స్ విమానాల్లో తెలుగు కన్నడ భాషల్లో మెనూలు అందించింది. సాధారణంగా విమానాల్లో మెనూను ఇంగ్లీష్, హిందీ భాషల్లో మాత్రమే ఇస్తారు. కానీ ఎమిరేట్స్ విమానంలో (Emirates Airlines) ఈ మెనూను ఇంగ్లీష్, అరబిక్ భాషలతో పాటు తెలుగులో (Telugu) కూడా ముద్రించారు. బెంగళూరు నుంచి వెళ్లే ప్రయాణికులకు కన్నడలో (Kannada) కూడా మెనూ అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ లంచ్ మెనూ వైరల్ అవుతోంది. తెలుగు భాషను అమితంగా ప్రేమించే వారంతా ఎమిరేట్స్ విమానంలో తమ మాతృభాషను చూసి ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రపంచ వేదికపై తెలుగు (Telugu) భాషకు దక్కిన మరో గుర్తింపుగా భావిస్తున్నారు.