ఈ ఎయిర్‌పోర్ట్‌లో నో పాస్‌పోర్టు, ఐడీ కార్డు!

విదేశాలకు వెళ్లాలంటే పాస్‌పోర్టు ఎంతో ముఖ్యమన్న సంగతి మనందరికీ తెలిసిందే. విమానం ఎక్కేముందు పాస్ పోర్టు పత్రాల తనిఖీల కోసం కాస్త సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో అబుదాబిలోని షేక్ జాయెద్ ఇంటర్నెషనల్ విమానాశ్రయం లో కొత్త సాంకేతికతను అమల్లోకి తీసుకురానున్నారు. ప్రయాణికుల ముఖ కవళికలను గుర్తించగల టెక్నాలజీని ప్రవేశపెట్టనుంది. దీని ద్వారా ఇకపై పాస్‌పోర్టు, ఐడీ కార్డు అవసరం ఉండదని తెలుస్తోంది. ప్రయాణానికి ముందు క్యూలో నిలబడి ప్రతి సెక్యూరిటీ గేటు వద్ద పత్రాలను తనిఖీ చేసే పని ఇక ఉండదు. దీనికి బదులు ఫేషియల్ స్కానర్ టెక్నాలజీని వినియోగిస్తారు. దీని ద్వారా సమయం ఆదా కానుంది. ఒక వేళ ఇది అమలైతే, ఫేషియల్ ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీని వినియోగించిన తొలి అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుగా అవతరించనుంది.