శక్తివంతమైన మహిళల్లో ఆరుగురు భారతీయులు
ఫోర్బ్స్ ఈ ఏడాది ప్రపంచంలోనే శక్తిమంతమైన 100 మంది మహిళల జాబితా లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సహా ఆరుగురు భారత మహిళలు చోటు దక్కించుకున్నారు. ఈసారి జాబితాలో 36వ స్థానంలో నిలిచిన నిర్మల, గత మూడేళ్లుగా వరుసగా 34, 41, 37 స్థానాల్లో నిలిచారు. ఇక జాబితాలో హెచ్‌సీఎల్ టెక్ చైర్పర్సన్ రోష్ని నాడార్ (53వ ర్యాంకు), సెబీ చైర్ పర్సన్ మాధాబి పురీ బుచ్ (54వ ర్యాంకు), సెయిల్ చైర్పర్సన్ సోమా మోండల్ (67వ ర్యాంకు) బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్ పర్సన్ కిరణ్ మజుందార్‌షా (72వ), నైకా వ్యవస్థాపకులురాలు ఫల్గుణి నాయర్ (89వ) ఉన్నారు. ఐరోపా సమాఖ్య అధ్యక్షురాలు ఉర్సు లా వాన్‌డెర్ లియెన్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు.






