Whatsapp : వాట్సప్ కొత్త ఫీచర్.. ఇక మూడు యాప్‌లలో

కొత్త కొత్త ఫీచర్లను అందించడంలో ప్రముఖ మెసేజ్ యాప్ వాట్సప్ (Whatsapp) ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా మరో కొత్త సదుపాయంతో యూజర్లను ఆకట్టుకోనుంది. వాట్సప్ స్టేటస్‌నే నేరుగా ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్(Instagram) స్టోరీలుగా పెట్టే సదుపాయం తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని మెటా (Meta) తన బ్లాగ్ పోస్ట్‌లో పంచుకుంది. సాధారణంగా నచ్చిన విషయాన్ని వాట్సప్‌లోని వారందరితోనూ పంచుకోవాలంటే స్టేటస్ ఆప్షన్ ఎంచుకుంటాం. ఇదే వాట్సప్ స్టేటస్‌ను ఫేస్‌బుక్‌లోనూ స్టోరీగా పెట్టుకోవాలంటే స్టేటస్ ఎంపికలోనే ఇప్పటికే వాట్సప్‌లో పెట్టే స్టేటస్‌నే నేరుగా ఫేస్‌బుక్‌లో ఫేస్‌బుక్ (Facebook) అనే కొత్త ఆప్షన్‌ను వాట్సప్ అందిస్తోంది. ఇకపై ఇందులో ఇన్‌స్టాగ్రామ్ కూడా యాడ్ కానుంది. అంటే ఇకపై వాట్సప్‌లో పెట్టే స్టేటస్‌నే నేరుగా ఈ రెండు ప్లాట్‌ఫామ్‌లలోనూ స్టోరీలుగా పెట్టేయొచ్చు. దీని కోసం ప్రత్యేకంగా యాప్‌నకు వెళ్లి అప్‌లోడ్ అవసరం ఉందన్నమాట. స్టేటస్ పెట్టే సమయంలో ఫేస్‌బుక్ స్టోరీస్, ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ అని రెండు ఆప్షన్లు కనిపించనున్నాయి. వాటిని ఎనేబల్ చేసుకొని ఈ సదుపాయం పొందొచ్చు. ఒకవేళ వద్దనుకుంటే డిసేబుల్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ను వాట్సప్ ప్రపంచ వ్యాప్తంగా రోలవుట్ చేయనుంది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది. దీంతో అవతార్స్, మెటా ఏఐ స్టిక్కర్స్ ఇలా కొత్త ఫీచర్లు కూడా వాట్సప్‌లో అందుబాటులోకి రానున్నాయి.