అమెరికాకు కొత్త ఔషధాలు
అమెరికా విపణికి కొన్ని కొత్త ఔషధాలు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు నాట్కో ఫార్మా సీఈవో రాజీవ్ నన్నపనేని తెలిపారు. అమెరికాలో పారా-4 అర్హతతో 19 రకాల ఔషధాలకు అనుమతి లభించినట్లు తెలిపారు. దాదాపు 100 కోట్ల డాలర్ల వార్షిక అమ్మకాలు నమోదు చేసే ఔషధాలు ఇందులో ఉన్నట్లు వెల్లడించారు. ఇప్పటికే విడుదల చేసిన రెవ్లీమిడ్పై ఆకర్షణీయ ఆదాయాలు లభిస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కెనడా, బ్రెజిల్ దేశాల్లోనూ అమ్మకాలు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తు చేశారు. బ్రెజిల్లో ఏడాదిలో 5-6 కొత్త ఔషధాలు విడుదల చేస్తామని అన్నారు.






