అమెరికాకు కాంగ్రెలార్ జనరిక్ ఔషధం!
కరోనరీ యాంజియోప్లాస్టీ చికిత్స చేయించుకునే వారిలో రక్తం గడ్డకట్టడం, లేదా గుండె పోటు రావడం వంటి సమస్యలను అదుపు చేసేందుకు వినియోగించే కాంగ్రెలార్ జనరిక్ ఔషధాన్ని అమెరికాలో విక్రయించడానికి స్థానిక ఫార్మా కంపెనీ ఎంఎస్ఎన్ లేబొరేటరీస్ తాత్కాలిక అనుమతి సంపాదించింది. యూఎస్ఎఫ్డీఏ నుంచి కాంగ్రెలార్ జనరిక్ ఔషధం ఇంజక్షన్‌కు తాత్కాలిక అనుమతి వచ్చిందని ఎంఎస్ఎన్ లేబొరేటరీస్ వెల్లడిరచింది. ఈ ఔషధాన్ని హైదరాబాద్ సమీపంలోని యూఎస్ఎఫ్డీఏ, ఎంహెచ్ఆర్ఏ అనుమతి గల తన యూనిట్లో ఉత్పత్తి చేయనుంది.






