Microsoft : ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ చల్లటి కబురు

భారత్‌లోని తన ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ (Microsoft )ఇండియా చల్లటి కబురు చెప్పింది. ఈ సంవత్సరం భారత్ (India) లో ఎవరినీ ఉద్యోగాల నుంచి తొలగించే ఆలోచన లేదని మైక్రోసాఫ్ట్ ఇండియా, సౌత్ ఆసియా ప్రెసిడెంట్ పునీత్ చందోక్ (Puneet Chandok) తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్‌కు 2.28 లక్షల మంది ఉద్యోగులు ఉంటే అందులో 20,000 మంది భారత్‌లో ఉన్నారు. పనితీరు ఆధారంగా తన మొత్తం ఉద్యోగుల్లో ఒక శాతం మందిని తీసివేయాలని కంపెనీ నిర్ణయించింది. ఈ ప్రభావం భారత్‌లోని ఉద్యోగులపైనా పడుతుందని భయపడ్డారు. అయితే అదేమీ లేదని మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ ప్రకటించడంతో ఉద్యోగులు (Employees) ఊపిరి పీల్చుకున్నారు.