మైక్రోసాఫ్ట్ జీడీసీ లీడర్ గా అపర్ణ గుప్తా
సాంకేతిక దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన గ్లోబల్ డెలివరీ సెంటర్ (జీడీసీ) లీడర్‌గా అపర్ణ గుప్తాను నియమించినట్లు వెల్లడించింది. 2005లో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం బెంగళూరు, నోయిడాలకు విస్తరించింది. జీడీసీకి లీడర్‌గా అపర్ణ కస్టమర్ ఇన్నోవేషన్, డెలివరీ ఎక్స్‌లెన్స్, క్లౌడ్ తదితర విభాగాలకు నాయకత్వం వహించనున్నారు. జీడీసీలో సెంటర్ ఆఫ్ లెక్స్లెన్స్, డేటా, కృత్రిమ మేధ, ఇన్ఫ్రా అండ్ సెక్యూరిటీ, బిజినెస్ అప్లికేషన్స్ విభాగాలున్నాయి. ఆరేళ్ల క్రితం అపర్ణ మైక్రోసాఫ్ట్‌లో కమర్షియల్ సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ లీడ్‌గా చేరారు.






