Microsoft :మైక్రోసాఫ్ట్ లో మరోసారి లే ఆఫ్ లు!

ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ (Microsoft ) ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న వారిపై ఈ ప్రభావం పడనుందని సమాచారం. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ ప్రతినిధి ఒక తెలిపారు. మైక్రోసాఫ్ట్‌లో మెరుగైన పనితీరు కనబర్చిన ఉద్యోగులనూ ప్రోత్సహిస్తాము. కొత్త విషయాలు నేర్చుకొనేందుకు, ఎదిగేందుకు ప్రయత్నించేవారికి మేము ఎప్పుడూ తోడుంటాం. పనిచేయని వారిపై తగిన చర్యలు తీసుకుంటాం అని మైక్రోసాఫ్ట్ అధికార ప్రతినిధి(Microsoft spokesperson) అన్నారు. మెరుగైన పనితీరు చూపించే వారి సంఖ్యను పెంచుకొనే విస్తృత ప్రయత్నంలో భాగంగా ఈ లేఆఫ్(Lay off) నిర్ణయం తీసుకుంది. కంపెనీలోని మొత్తం ఉద్యోగుల్లో(Employees) 1 శాతం కంటే తక్కువమంది పై ఈ ప్రభావం పడనుంది.