Meta : మెటాలో 5 శాతం ఉద్యోగ కోతలు

మెటా ఈసీవో మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది తమ మొత్తం సిబ్బందిలో 5 శాతం (5 percent) మందిని తొలగించడానికి మెటా (Meta) ప్లాట్‌ఫామ్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. తక్కువ పనితీరు కనబరుస్తున్న వారిని వెంటనే తొలగించమని ఉన్నతాధికారులకు పంపిన అంతర్గత సమాచారంలో జుకర్‌బర్గ్ పేర్కొన్నట్లు సమాచారం. ప్రస్తుతం మెటాలో దాదాపు 72,000 మంది పనిచేస్తున్నారు. ఇందులో 5 శాతం సిబ్బంది (Staff ) అంటే 3,600 మందిని తొలగించే అవకాశం ఉంది.