మెటా అనూహ్య నిర్ణయం.. జుకర్ బర్గ్ కు
ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు లేఆఫ్‌ల పేరుతో ఉద్యోగులను తొలగిస్తూ ఖర్చులు తగ్గించుకున్న వేళ ఫేస్బుక్ యాజమాన్య సంస్థ మెటా అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఫేస్బుక్ మాతృసంస్థ మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ సెక్యూరిటీ అలవెన్స్‌ను కంపెనీ భారీగా పెంచింది. కుటుంబంతో కలిసి జుకర్‌బర్గ్ భద్రత కోసం ఇచ్చే పరిహారాన్ని 4 మిలియన్ డాలర్లు పెంచి 14 మిలియన్ డాలర్ల (సుమారు రూ.115 కోట్లు) చేరింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో పెంపు అవసరమని భావించినట్లు కంపెనీ తెలిపింది. ఇటీవల మెటా తమ వివిధ వ్యాపారాల్లో భారీ ఎత్తున ఉద్యోగుల్ని తొలగించిన విషయం తెలిసిందే. మరోవైపు మరింత మందిని కూడా సాగనంపే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయనకు భద్రత పెంచినట్లు కంపెనీ వర్గాల ద్వారా తెలుస్తోంది.






