నాట్కో ఫార్మాపై అమెరికాలో కేసు
నాట్కో ఫార్మా, దాని మార్కెటింగ్ భాగస్వామి మైలాన్ ఫార్మాస్యూటికల్స్, ఇతరులపై జాన్సన్ అండ్ జాన్సన్, మొమెంటా ఫార్మాస్యూటికల్స్ అమెరికా కోర్టులో కేసు వేశాయి. 20 ఎంజీ/ ఎంఎల్, 40 ఎంజీ/ ఎంఎల్ గ్లాటిరామెర్ ఎసిటేట్ ఇంజెక్షన్‌కు సంబంధించి రెండు పేటెంట్ హక్కులను నాట్కో దాని భాగస్వామి ఉల్లంఘించినట్లు పేర్కొన్నాయి. పెన్సిల్వేనియా ఫెడరల్ కోర్టులో కేసు దాఖలైనట్టు నాట్కో వెల్లడించింది. అయితే ఈ కేసులో బలం లేదనా నాట్కో, మైలాన్లు పేర్కొన్నాయి. గత ఐదేళ్లుకు పైగా మార్కెట్లో ఈ ఉత్పత్తి ఉందని కేసుపై బలంగా తమ వాదనలు వినిపిస్తాయని నాట్కో తెలిపింది.






