ఐరోపా, అమెరికాకు నచ్చకపోయినా సరే… రష్యా నుంచి
ఐరోపా, అమెరికాలకు నచ్చకపోయినా సరే రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటూనే ఉంటామని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ప్రకటించారు. రష్యా నిరుడు ఫిబ్రరిలో ఉక్రెయిన్పై దండెత్తినప్పుడే ఐరోపా దేశాలు ఎందుకు చమురు దిగుమతులను బంద్ చేయలేదని ప్రశ్శించారు. అప్పటి నుంచి అవి భారత్ కన్నా ఆరు రెట్లు ఎక్కువగా రష్యన్ చమురును దిగుమతి చేసుకున్నాయని ఆయన గుర్తు చేశారు. ఐరోపా దేశాలు తమ ప్రజలకు ఇబ్బంది కలగని రీతిలో రష్యన్ చమురు దిగుమతులను క్రమక్రమంగా తగ్గించుకొంటూ వచ్చాయన్నారు. భారతదేశంపై పాక్ రెచ్చగొడుతున్న సీమాంతర ఉగ్రవాదాన్ని చూసి ప్రపంచం ఆందోళన చెందాలని హెచ్చరించారు. పాకిస్థాన్ నగరాల్లో బాహాటంగానే ఉగ్రవాద శిక్షణ శిబిరాలు నడుస్తున్నా ఆ సంగతి అక్కడి ప్రభుత్వానికి తెలియదనుకోవాలా? అని ప్రశ్నించారు.






