ITC లిమిటెడ్ ఫుడ్స్ డివిజన్ ప్రవేశపెడుతోంది ‘సన్‌ఫీస్ట్ కేకర్’
కేక్స్ విభాగంలో ఉనికిని మరింత విస్తరించేలా వినూత్నఫార్మాట్లో ఈ ఆవిష్కరణను ముందుకు తెస్తోంది
ITC యొక్క సన్‌ఫీస్ట్ వినియోగదారులు అమితంగా ఇష్టపడే కన్జ్యూమర్ బిస్కట్స్ బ్రాండ్లలో ఒకటి. ఇప్పుడు కేక్స్ విభాగంలో అడుగు పెట్టడం ద్వారా ఒక కొత్త సబ్-బ్రాండ్ ప్రవేశపెడుతోంది, అదే సన్‌ఫీస్ట్ కేకర్. వినియోగదారులకు అందుబాటు ధరలలో అత్యుత్తమమైన రుచులు అందించే విధంగా వినూత్నమైన ప్రొడక్టులు ప్రవేశపెట్టడంలో ఈ బ్రాండ్ ఓ ప్రత్యేక పోర్టుఫోలియో కలిగి ఉంది. విస్తృత స్థాయిలో ఉన్న వినియోగదారుల సంఖ్యకు అనుగుణంగా వారికి మరింత సౌకర్యంగా ఉండేలా మరియు సంతృప్తిని కలిగించేందుకు తన విభాగాలను మరింత విస్తరించే దిశగా సాగుతోంది. వారు తమ అల్పాహారం మరింత ఆస్వాదించే విధంగా ముందడుగు వేస్తోంది. సన్‌ఫీస్ట్ కేకర్ సిగ్నేచర్‌తో సహా మూడు ఫార్మాట్లలో ప్రవేశపెట్టబడుతోంది. ఈ విభాగంలో మొదటిది ‘ట్రినిటీ’, ఈ ఉత్పత్తి ఒక విభిన్నమైన ఆవిష్కరణ. ఇంతకు ముందెన్నడూ చవిచూడని విధంగా ఒక అద్భుతమైన రుచిని పరిచయం చేస్తుంది. ఇది ట్రిపుల్ లేయర్డ్ కేక్. ఇందులో దిగువ భాగంలో చాకో ఉంటుంది. మధ్య భాగంలో చాకో క్రీమ్ నిండి ఉంటుంది. ఇక పై భాగంలో చాకో డ్రిజిల్ నోరూరిస్తుంది. రెండో ఫార్మాట్ సరికొత్తగా కనిపిస్తుంది. అదే చాకో స్విస్ రోల్, ఇది ఒక చాకో డ్రిజిల్‌తో అలంకరించబడి ఉంటుంది. చూసేందుకు అత్యద్భుతంగా కనిపించే ఒక ఫ్రెష్ బేకరీ ప్రొడక్ట్. ఇక మూడవది మరింత ఉత్తేజం కలిగించే ఉత్పత్తి అయిన లేయర్ కేక్స్. ఇవి చాకో మరియు బటర్‌స్కాచ్ అనే రెండు వేరియంట్లలో లభ్యమవుతాయి.
సన్‌ఫీస్ట్ గతంలో 2018లో సన్‌ఫీస్ట్ కేక్‌లను ప్రారంభించడంతో 2500+ కోట్ల కక్ విభాగంలోకి ప్రవేశించి వినియోగదారుల ఆదరణ చూరగొంది. కేవలం రెండు సంవత్సరాల కాలంలోనే లేయర్డ్ కేక్స్ సెగ్మెంట్లో ముందంజలోకి వచ్చింది. ఈ విభాగంలో 22% మార్కెట్ షేర్ కలిగిన సన్‌ఫీస్ట్ ఈ సరికొత్త ఉత్పత్తి ద్వరా తన కేక్స్ పోర్టుఫోలియోను మరింతగా విస్తరిస్తోంది.
ఈ ఉత్పత్తిని ప్రవేశపెడున్న సందర్భంగా ITC లిమిటెడ్ బిస్కట్స్ & కేక్స్ క్లస్టర్, ఫుడ్స్ డివిజన్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీ అలీ హారిస్ షరె మాట్లాడుతూ ‘‘భారతదేశంలో కేక్స్ విభాగంలో మంచి ఆశాజనకమైన పురోగతి కనిపిస్తోంది. ఇది ఇంకా పెరుగుతుంది. దీనిని పరిగణనలోకి తీసుకుని బిస్కట్స్ సెగ్మెంట్లో మాకున్న అనుభవం దృష్ట్యా మా ఉత్పత్తులు మరింత విస్తరించడానికి ఇదే సరైన సమయం అని మేము భావిస్తున్నాము. ప్యాకేజ్డ్ కేక్స్ విషయంలో కొనుగోలుదారుల ఆసక్తులను వారి వినియోగాన్ని పున: నిర్వచించే రీతిలో ఈ విభాగంలో మరింత పురోగతి సాధించడమే మా ప్రధాన లక్ష్యం. మా ప్రత్యేకమైన ఉత్పత్తుల ద్వారా ఫ్రెష్ బేకరీ కేక్స్ మరియు ప్యాకేజ్డ్ కేక్స్ మధ్య పోటీలో ఉండే వెలితిగా అనిపించే అంశాలను భర్తీ చేయడం ద్వారా వినియోగదారులను ఆకట్టుకోవడానికి గట్టి ప్రయత్నం చేస్తాం. దేశం విశ్వసించే ఒక బ్రాండ్‌గా ప్రత్యేకంగా రూపొందించిన సన్‌ఫీస్ట్ కేకర్ కొత్త రేంజ్‌తో దేశం నలుమూలలా ఉన్న ఇళ్లలో ఆనందం పంచాలన్నదే మా ముందున్న ఆశయం.’’ అని వివరించారు.
ఈ ప్రీమియం క్వాలిటీ సమర్పణలు ఇండస్ర్టీ ప్రైస్ పాయింట్స్ మేరకు వినియోగదారులు అందరికీ సరసమైన ధరల్లో అందుబాటులో ఉంటాయి. ప్రతి ఇంటిలోనూ తప్పనిసరిగా దీనిని ఆస్వాదించేలా చేయడమే లక్ష్యంగా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతోంది. 28 గ్రాముల ట్రినిటీ ఎస్కెయు మరియు 29 గ్రాముల స్విస్ రోల్ ఎస్కెయు రూ. 10 ధరకు లభిస్తాయి. ఇక లేయర్ కేక్స్ రెండు ధరల్లో లభిస్తాయి. వరసగా రూ. 5 & రూ. 10 ధరల్లో ఇవి లభిస్తాయి. సన్‌ఫీస్ట్ కేకర్ దేశ వ్యాప్తంగా నవంబర్ 2020 నుంచి అందుబాటులోకి వస్తుంది.






