Intel: ఇంటెల్ లో భారీ ఉద్యోగాల కోత .. 24వేల మంది ఉద్వాసన

అమెరికాకు చెందిన సెమీకండక్టర్ల (చిప్) తయారీ దిగ్గజం ఇంటెల్ (Intel) ఏకంగా 24,000 ఉద్యోగాల కోత పెట్టే యోచనలో ఉంది. గత ఏడాది చివరినాటికి కంపెనీలో పనిచేస్తున్న 99,500 మంది సిబ్బందిలో ఇది దాదాపు 25 శాతానికి సమానం. ఈ ఏడాది చివరికి సిబ్బందిని 75,000కు తగ్గించుకోవాలని కంపెనీ భావిస్తోంది. జూన్ త్రైమాసికంలోనే కొందరిని ఇంటికి సాగనంపిన ఇంటెల్, తాజాగా మరిన్ని విభాగాల్లో కోతలను ప్రారంభించింది. ఆర్థిక కష్టాల్లో ఉన్న ఇంటెల్‌ను తిరిగి గాడి లో పెట్టేందుకు కొత్త సీఈఓ లిప్-బు టాన్ (Lip Bu Tan) భారీ వ్యాపార పునర్‌వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టారు. వ్యయాల్ని తగ్గించేందుకు వేల సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలకడంతోపాటు జర్మనీ (Germany), పోలెండ్ (Poland)లో ప్రాజెక్టుల విస్తరణ ప్రణాళికకు స్వస్తి పలికారు.