ఇన్ స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్

ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడో పాపులర్ యాప్. దాంట్లో రీల్స్ చూస్తు ఈజీగా కాలం గడిపేస్తున్నారు జనం. అయితే కొన్ని అసభ్యకర వీడియోలు యువతను ఇబ్బంది పెడుతున్నాయి. లైంగిక వేధింపుల నుంచి రక్షణ పొందేందుకు సోషల్ మీడియా కంపెనీ ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడో కోత్త ఫీచర్‌ను ప్రారంభించనున్నది. డైరెక్ట్‌గా వచ్చే మెసేజ్‌ల్లో ఉన్న నగ్న ఇమేజ్‌లు లేదా వీడియోలకు బ్లర్ ఫీచర్‌ను జోడిస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ చెప్పింది. తన బ్లాగ్‌పోస్టులో ఈ విషయాన్ని కంపెనీ వెల్లడించింది. ఇమేజ్ అబ్యూజ్, సెక్యువల్ స్కామ్‌ల నుంచి రక్షణ కల్పించేందుకు ఈ కొత్త తరహా ఫీచర్‌ను డెవలప్ చేస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ తెలిపింది. యువతను క్రిమినల్స్ టార్గెట్ చేయకుండా ఉండేందుకు ఆ ఫీచర్ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.