Infosys : ఇన్ఫోసిస్ కీలక ప్రకటన … ఈ ఏడాది 20 వేలమంది

ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ (Infosys) కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది 20 వేల మంది ఫ్రెషర్లను నియమించుకుంటామని ప్రకటించింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 17 వేల మందిని నియమించుకున్నామని, మరో 20వేల మంది కాలేజీ గ్రాడ్యుయేట్ల (College graduates) ను ఈ ఏడాది నియమించుకుంటామని కంపెనీ సీఈఓ సలీల్ పరేఖ్ (Salil Parekh) వెల్లడిరచారు. ఈ సందర్భంగా ఏఐ (AI), వేతానాల పెంపు వంటి అంశాలపైనా మాట్లాడారు. దాదాపు 12 వేలమంది ఉద్యోగులను తొగిస్తామన్న టీసీఎస్ (TCS) ప్రకటన వేళ ఇన్ఫీ నుంచి ఈ ప్రకటన వెలువడడం గమనార్హం.
Tags