Infosys :ఉద్యోగులకు ఇన్ఫోసిస్ గుడ్ న్యూస్.. త్వరలో!

ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్(Infosys) ఉద్యోగులకు త్వరలో గుడ్ న్యూస్ (Good news ) చెప్పనుందని తెలుస్తోంది. ఫిబ్రవరి (February) లో వేతనాల పెంపును ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. దీనికి సంబంధించి త్వరలో ఉద్యోగులకు సమాచారం అందించనుంది. వేతనాల పెంపు సమాచారం మొదట జాబ్ లెవల్ 5 ( జేఎల్5)లోని ఉద్యోగులకు అందుతుందని తెలుస్తోంది. వీరికి ఫిబ్రవరిలో సంబంధిత లెటర్స్ జారీ చేయనున్నారు. అయితే జనవరి 1 నుంచి ఈ జీతాల పెంపు అమల్లోకి వస్తుందని సమచారం. జేఎల్5లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, సీనియర్ ఇంజినీర్లు, సిస్టమ్ ఇంజినీర్లు, కన్సల్టెంట్లు ఉంటారు. ఇక జాబ్ లెవల్ 6 ఆపై ఉన్నవారికి మార్చిలో లెటర్స్ అందుతాయని తెలుస్తోంది. వీరికి ఏప్రిల్ నుంచి పెంపు వర్తిస్తుందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. జీతాల పెంపునకు సంబంధించి కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు.