India: భారత్ పై రూ.96,000 కోట్ల భారం
భారత ఎగుమతులపై అదనపు సుంకాలు, జరిమానాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించారు. అమెరికా బెదిరింపులకు స్పందనగా రష్యా (Russia) చమురు దిగుమతులను తగ్గించుకుంటే, భారత్ (India ) పై ఏటా 9-11 బిలియన్ డాలర్ల (రూ.78,000-96,000 కోట్లు) భారం పడొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు వినియోగదారు, దిగుమతి దేశంగా భారత్ ఉంది. 2022లో రష్యా- ఉక్రెయిన్ (Ukraine) యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా చమురుపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో రాయితీ ధరలకు రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుని భారత్ గణనీయంగా లబ్ధి పొందింది. యుద్దానికి ముందు భారత్ దిగుమతుల్లో రష్యా చమురు వాటా 0.2 శాతం కంటే తక్కువగా ఉంది. ప్రస్తుతం 35-40 శాతానికి చేరింది. ఫలితంగా భారత దిగుమతి భారం తగ్గి, రిటెయిల్ ఇంధన ధరలు ద్రవ్యోల్బణం అదుపులో ఉండటానికి దోహదపడిరది.







