హెల్తియమ్ మెడ్‌టెక్‌కు యూఎస్ గుర్తింపు
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలోని హెల్తియమ్ మెడ్‌టెక్ యూనిట్‌కు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) రిజిస్ట్రేషన్ లభించింది. ఈ సంస్థ సర్జికల్, పోస్ట్-సర్జికల్, క్రానిక్ కేర్ విభాగాలకు అవసరమైన వైద్య పరికరాలు ఉత్పత్తి చేస్తోంది. శ్రీసిటీలోని యూనిట్‌కు యూఎస్ఎఫ్డీఏ రిజిస్ట్రేషన్ లభించటంతో తాము అనుసరించే నాణ్యతా ప్రమాణాలకు గుర్తింపు లభించినట్లు అయ్యిందని హెల్తియమ్ మెడ్‌టెక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో అనీష్ బాఫ్నా తెలిపారు. శ్రీసిటీ యూనిట్‌ను ఈ సంస్థ 2012లో ప్రారంభించింది.






