IRDAI : ఐఆర్‌డీఏఐ నూతన చైర్మన్‌గా అజయ్ సేథ్

భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ ( ఐఆర్‌డీఏఐ) నూతన చైర్మన్‌గా ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి అజయ్ సేథ్ (Ajay Seth) ను ప్రభుత్వం నియమించింది. 1987 బ్యాచ్ కర్ణాటక (Karnataka) క్యాడర్ ఐఏఎస్ (IAS) అధికారి అయిన అజయ్ సేథ్ కేంద్ర ఆర్థిక సేవల విభాగానికి నాలుగేళ్లు కార్యదర్శిగా పనిచేశారు. ఈ ఏడాది జూన్ లో పదవీ విరమణ చేశారు. మూడేళ్ల పాటు ఐఆర్‌డీఏఐ (IRDAI) చైర్మన్ పదవిలో కొనసాగుతున్నారు. మార్చిలో దేవాశిష్ పాండా (Devashish Panda) పదవీకాలం పూర్తయింది. నాలుగు నెలల పాటు ఖాళీగా ఉన్న ఐఆర్‌డీఏఐ చైర్మన్ పదవిని అజయ్ సేథ్‌తో భర్తీ చేశారు.