గూగుల్ వేజ్ యాప్‌లో అద్భుత ఫీచర్
గూగుల్‌కు చెందిన వేజ్యాప్లో అద్భుత ఫీచర్ అందుబాటులోకి రానున్నది. వాహనాలు నడిపేటప్పుడు రోడ్డుపై ఎక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నదన్న విషయాన్ని ఈ యాప్ ముందే చెప్పేస్తుంది. ప్రస్తుతం బీటా వర్సెన్లలో అందుబాటులో ఉన్నది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానున్నదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ యాప్‌లో రోడ్డు మార్గాలు, వాటిపై ట్రాఫిక్ రద్దీ, ప్రమాదాలు జరిగిన చరిత్ర మొత్తం రియల్‌టైమ్‌లో నిక్షిప్తమై ఉంటుంది. ప్రమాదకర ప్రాంతాల వివరాలు కూడా ఉంటాయి. దీంతో డ్రైవర్ వాహనం నడిపేటప్పుడు ముందు ప్రమాదకర ప్రాంతం ఉంటే యాప్‌లో ఆ ప్రాంతం ఎరుపు రంగులో కనిపిస్తుంది.






