గూగుల్‌కు భారీ ఎదురుదెబ్బ … రూ.21వేల కోట్ల జరిమానా
గూగుల్‌కు యూరప్‌లో భారీ ఎదురుదెబ్బ తగిలింది. యూరోపియన్ యూనియన్ (ఈయూ) విధించిన దాదాపు రూ.21వేల కోట్ల (2.8 బిలియన్ డాలర్లు) జరిమానాను సవాల్ చేస్తూ అక్కడి రెండో అత్యున్నత న్యాయస్థానంలో వేసిన కేసులో ఓడిపోయింది. యూరోపియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ జనరల్ కోర్ట్ ఈయూ కాంపిటీషన్ కమిషన్ ఫైన్‌ను సమర్థిస్తూ గూగుల్ అభ్యర్థనను తిరస్కరించింది. నిబంధనలకు విరుద్ధంగా ధరల్ని పోల్చుతూ గూగుల్ తమ సొంత షాపింగ్ సిఫార్సులను బలవంతంగా ఇంటర్నెట్ వినియోగదారులపై రుద్దుతున్నదన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై దృష్టి పెట్టిన ఈయూ యాంటీట్రస్ట్ గూగుల్ వల్ల స్థానిక వ్యాపారులకు నష్టం వాటిల్లుతున్నదంటూ 2017లో 2.8 బిలియన్ డాలర్ల జరిమానా వేసింది. కాగా ఈ కేసులో యూరప్ అత్యున్నత న్యాయస్థానం ఈయూ కోర్ట్ ఆఫ్ జస్టిస్‌కు గూగుల్ వెళ్లేందుకూ అవకాశాలున్నాయి.






