గూగుల్ శుభవార్త .. వచ్చే ఏడాది నుంచి
గేమింగ్ ప్రియులకు గూగుల్ అదిరిపోయే శుభవార్త తెలిపింది. వచ్చే ఏడాది నుంచి ల్యాప్ టాప్, పీసీ, ట్యాబ్లెట్ వంటి పరికరాలలోని విండోస్ ప్లాట్ఫామ్ లో కూడా ఎటువంటి చింత లేకుండా గేమ్స్ ఆడేందుకు ప్రత్యేక ప్లాట్ఫామ్ తీసుకొని రానున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు విండోస్ ప్లాట్పామ్ మీద గేమ్స్ ఆడాలంటే వేర్వేరు పోర్టల్ నుంచి గేమ్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సి వచ్చేది. మొబైల్ లోని గూగుల్ ప్లే స్టోర్ గేమ్స్ లాగా ఒకే దగ్గర కావు, దీంతో గేమింగ్ ప్రియులు కొంత అసౌకర్యానికి గురి అయ్యేవారు. గేమింగ్ లవర్స్ ఆసక్తిని గమనించిన గూగుల్ విండోస్ ప్లాట్ ఫామ్లో కూడా ప్లే స్టోర్ లాంటి ప్రత్యేక ప్లాట్ ఫామ్ తీసుకొని రానున్నట్లు ప్రకటించింది. గేమ్ అవార్డ్స్ 2021 సందర్భంగా హోస్ట్ జియోఫ్ కీగ్లీ ప్రధాన క్రాస్ ప్లాట్ఫామ్ ప్రకటన చేశారు. గూగుల్ నిర్మించి గూగుల్ ప్లే యాప్ విండోస్ ప్లాట్ఫారంపై కూడా లభ్యం కానుంది. దీంతో గేమింగ్ లవర్స్ తమ విండోస్ పీసీలో ఆండ్రాయిడ్ గేమ్స అడుకోవచ్చు.






