అమెరికా ను మించిన చైనా
అగ్రరాజ్యం అమెరికాను వెనక్కి నెట్టేసి చైనా, సంపద సృష్టిలో ముందుకు దూసుకెళ్తోంది. అమెరికా, చైనా మధ్య కొన్నాళ్లుగా వాణిజ్య పోరు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అమెరికాకు షాకిచ్చే రీతిలో మరో సంచలనం నమోదు అయ్యింది. ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశం డ్రాగన్ దేశంగా చైనా ఆవిర్భవించింది. గడిచిన రెండు దశాబ్ధాల్లో ప్రపంచవ్యాప్తంగా సంపద మూడింతలు పెరిగినట్లు విశ్లేషకులు అంచనా వేశారు. దాంట్లో కమ్యూనిస్టు చైనా ముందంజలో ఉన్నట్లు తేల్చారు. టాప్ స్పాట్లో ఉన్న అమెరికాను వాళ్లు వెనక్కి నెట్టేశారు. దీనికి సంబంధించిన నివేదికను మెకెన్సీ అండ్ కంపెనీ తయారు చేశారు. పది అగ్రదేశాల జాతీయ బ్యాలెన్స్ షీట్లను పరిశీలించిన తర్వాత ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
మెకన్సీ కంపెనీ ప్రకారం ఆ పది దేశాల వద్ద ప్రపంచంలోని సుమారు 60 శాతం సంపద ఉన్నట్లు తెలుస్తోంది. ఆ దేశాల జాబితాలో అమెరికా, చైనా, జర్మనీ, ఫ్రాన్స్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్, మెక్సికో, స్వీడన్లు ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఇప్పుడు మనం సంపన్నులమయ్యాయమని జూరిచ్లోని మెకన్సీ గ్లోబల్ ఇన్స్టిట్యూట్ భాగస్వామి జాన్ మిచ్కి తెలిపారు. 2000 సంవత్సరంలో 156 ట్రిలియన్ డాలర్లు ఉన్న ప్రపంచ సంపద ఇప్పుడు 514 ట్రిలియన్ డాలర్లుగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంపదలో 68 శాతం రియల్ ఎస్టేట్ రంగంలోనే ఉంది.






