గీతా గోపీనాథ్ కు అరుదైన గౌరవం
అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్)కి చెందిన వాల్ ఆఫ్ పార్మర్ చీఫ్ ఎకనమిస్ట్స్లో చోటు దక్కించుకున్న తొలి మహిళగా, భారత్కు చెందిన రెండో వ్యక్తిగా గీతా గోపీనాథ్ ఘనత సాధించారు. 2003-06లో ఐఎమ్ఎఫ్కు ముఖ్య ఆర్థికవేత్తగా బాధ్యతలు నిర్వర్తించి రఘురామ్ రాజన్ ఈ గుర్తింపు పొందిన తొలి భారతీయుడు. 2018 అక్టోబరులో ఐఎమ్ఎఫ్ ముఖ్య ఆర్థికవేత్తగా గోపీనాథ్ నియమితులయ్యారు. గతేడాది డిసెంబరులో ఐఎమ్ఎఫ్ తొలి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా పదోన్నతి పొందారు. 1971 డిసెంబరు 8న మైసూరులో టీవీ గోపీనాథ్, వీసీ విజయలక్ష్మి దంపతులకు జన్మించిన గీత. ఢిల్లీ లోని లేడీ శ్రీరాం మహిళా కళాశాలలో బీఏ చేశారు. వాషింగ్టన్ యూనివర్సిటీలో ఎంఏ, ప్రిన్స్టన్ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పొందారు. అనంతరం 2005లో హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పని చేశారు.






