ఈ ఏడాది గౌతమ్ అదానీదే మొదటి స్థానం
ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది సంపద వృద్ధిలో గౌతమ్ అదానీదే మొదటి స్థానమని బ్లూమ్ బర్గ్ 50 నివేదిక తెలిపింది. ఈ ఏడాది ఆయన సంపద విలువ 49 బిలియన్ డాలర్ల ( రూ. 4 లక్షల కోట్లకు పైగా) మేర పెరిగింది. తద్వారా సంపద వృద్ధి లో బిల్‌గేట్స్, జెఫ్ బెజోస్, వారెన్ బఫెట్‌ను అదానీ వెనక్కి నెట్టారు. 125.5 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల్లో అదానీ మూడో స్థానంలో కొనసాగుతున్నారని పేర్కొన్నది. బెర్నార్డ్ అర్నాల్ట్, ఎలాన్ మస్క్ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. కొనుగోళ్ల ఒప్పందంలోనూ అదానీ ముందు వరసులో నిలిచారని నివేదిక వివరించింది.






