ఫోర్డ్ షాక్ … ఒకేసారి 3 వేల మంది
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఫోర్డ్ సిబ్బందికి గట్టి షాకిచ్చింది. అమెరికా, కెనడా, భారత్ లలో పనిచేస్తున్న వారిలో ఒకేసారి 3 వేల మంది సిబ్బందిని తొలగించడానికి సిద్ధమైంది. వీరిలో 2 వేల మంది వేతన సిబ్బంది కాగా, మిగతా వెయ్యి మంది కాంట్రాక్టు ఉద్యోగులని పేర్కొంది. తొలగించనున్న వారిలో అత్యధిక మంది ఉత్తర అమెరికా, భారత్‌లకు చెందినవారు కావడం విశేషం. పునర్వ్యవస్తీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు, అలాగే ఎలక్ట్రిక్ వాహనాన్ని రూపొందించడానికి కసరత్తును వేగవంతం చేసింది. ఈ ఉద్యోగాల తొలగింపునకు సంబంధించి సిబ్బందికి ఈ మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చింది. భారత్‌తో పాటు ఇతర దేశాల్లో కంపెనీకి చెందిన వాహనాలకు డిమాండ్ పడిపోవడం తో పాటు నిర్వహణ ఖర్చులు పెరిగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంస్థ వీటిని తగ్గించుకోవడంలో భాగంగా భారీగా ఉద్యోగాలను తొలగించడానికి సిద్దమైంది.






