ఫెడ్ రేటు 0.50 శాతం పెంపు… 15 ఏళ్ల గరిష్ట స్థాయికి
అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను మరో 0.50 శాతం పెంచింది. దాంతో ఫెడ్ రేట్లు 15 ఏళ్ల గరిష్ఠ స్థాయి 4.25-4.5 శాతం శ్రేనికి చేరుకున్నాయి. ధరల కట్టడి చర్యల్లో భాగంగా ఫెడ్ రిజర్వ్ వరుసగా గత 4సమీక్షల్లో వడ్డీ రేట్లను 0.75 శాతం చొప్పున పెంచుతూ వచ్చింది. ఈ మధ్య ధరలు కాస్త తగ్గుముఖం పట్టడంతో వడ్డింపుల తీవ్రత కూడా తగ్గవచ్చన్న విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే ఈసారి ఫెడ్ అర పెంపుతో సరిపెట్టింది. అయితే ధరపై పోరు ఇంకా ముగియలేదని, మున్ముందు సమీక్షల్లో మరింత వడ్డింపు తప్పదని సంకేతాలిచ్చింది.






