1994 తర్వాత ఇంతగా ఇప్పుడే .. ఫెడ్ వడ్డీ రేటు
కీలక వడ్డీ రేటును 0.75 శాతం పెంచుతున్నట్లు అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రకటించింది. 1994 తర్వాత ఇదే అతిపెద్ద పెంపు కావడం గమనార్హం. అమెరికా ద్రవ్యోల్బణం మేలో 41 ఏళ్ల గరిష్టమైన 8.6 శాతానికి చేరడంతో, అదపు చేసేందుకు ఫెడరేట్ల పెంపునకు మొగ్గు చూపింది. 2022కు అమెరికా జీడీపీ వృద్ధి అంచనాలను ఫెడ్ తగ్గించింది. 2.8 శాతం వృద్ధి లభిస్తుందని మార్చిలో అంచనా వేయగా, తాజాగా 1.7 శాతానికి పరిమితం చేసింది. అధిక ద్రవ్యోల్బణం ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవస్థ ఆవవహంగానే ఉన్నట్లు కమిటీ వెల్లడిరచింది. మొదటి త్రైమాసికంలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయని, ఉద్యోగ విపణి బాగుందని, నిరుద్యోగ రేటు తక్కువగానే ఉన్నట్లు వివరించింది.






