విమానాల్లో ఫ్లైట్ మోడ్ కు తెర
భారత్ సహా పలు దేశాల్లో ఇప్పటికే ఐదో తరం (5జీ) టెలికం సేవలు ప్రారంభమయ్యాయి. దీంతో వచ్చే ఏడాది నుంచి యూరోపియన్ యూనియన్ (ఈయూ) విమానయాన సంస్థల సర్వీసుల్లో ఫ్లైట్ మోడ్ కు తెర పడనున్నది. ఆయా విమానాల్లో ప్రయాణించేవారిని గరిష్ఠ సామర్థ్యం, ఫీచర్లతో మొబైల్ ఫోన్లను ఉపయోగించుకునేందుకు అనుమతించనున్నారు. తద్వారా వారంతా భూమిపై 5జీ మొబైల్ నెట్‌వర్క్‌లో పొందే సదుపాయాలను విమానాల్లో సైతం పొందేందుకు వీలవుతుంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను చేయడంలో ఈయూ సభ్య దేశాలు ఇప్పటికే నిమగ్నమమయ్యాయి. దీంతో వచ్చే ఏడాది నుంచి ఈయూ విమానయాన సంస్థల సర్వీసుల్లో ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లను ఫ్లైట్ మోడ్‌లో పెట్టకుండానే మ్యూజిక్ వీడియో స్ట్రీమింగ్ కంటెంట్‌ను ఆటంకం లేకుండా ఆస్వాదించొచ్చు.






