ఎలాన్ మాస్క్ కీలక నిర్ణయం.. మరోసారి
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరోసారి భారీ సంఖ్యలో టెస్లా షేర్లను విక్రయించాడు. అమెరికా స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ప్రకారం , మస్క్ 22 మిలియన్ల షేర్లను విక్రయించారు. వీటి విలువ 3.58 బిలియన్ డాలర్లు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి టెస్లా షేరు ధర 2.58 శాతం కుంగి 156 డాలర్లకు చేరింది. ఈ ఏడాది ఏప్రిల్ లో ట్విటర్ కొనుగోలు చేసిన తర్వాత దాదాపు 40 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను విక్రయించారు. అయినప్పటికీ సంస్థలో ఆయన వాటా 13.4 శాతం వాటా ఉంది. భాగస్వాముల్లో అతిపెద్ద వాటాదారు ఆయనే.






