టెస్లా అధినేత ఎలాన్ మస్క్ యూటర్న్..
ట్విట్టర్ కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ యూటర్న్ తీసుకున్నారు. నేరుగా ఈ విషయాన్ని చెప్పకుండా ట్విట్టర్లో నకిలీ ఖాతాలు భారీగా ఉన్నాయని అది తేల్చితే గాని తాను ముందుకు రాలేనని తాజాగా మరోసారి పునరుద్ఘాటించారు. ఈ రహస్యం వీడితే తప్పా తానేమి చేయలేనని కొత్త రాగం ఎత్తుకున్నారు. కాగా దీంతో ట్విట్టర్ ఒప్పందంపై పూర్తిగా నీలినీడలు కమ్ముకున్నట్లయ్యింది. ట్విటర్ మొత్తం అకౌంట్లలో ఫేక్ ఖాతాలు 5 శాతం ఉంటాయని, ఆ సంస్థ సిఈవో పరాగ్ అగర్వాల్ పేర్కొంటున్నారు. కాగా, ఈ నకిలీ ఖాతాలు 20 శాతం వరకు ఉంటాయని మస్క్ ఆరోపిస్తున్నారు.






