ఎలాన్ మస్క్ కు షాక్…. ప్రపంచ కుబేరుల జాబితాలో బెర్నార్డ్
ప్రపంచ కుబేరుల జాబితాలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మొదటి స్థానాన్ని కోల్పోయారు. ఆ స్థానాన్ని ఫ్రెంచ్ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్డ్ దక్కించున్నారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ తాజా నివేదిక ప్రకారం మస్క్ సంపద 168.5 బిలయన్ డాలర్లుగా ఉండగా, బెర్నార్డ్ సంపద విలువ 172.9 బిలియన్ డాలర్లుగా ఉంది. దీంతో మస్క్‌ను వెనక్కి నెట్టి బెర్నార్డ్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. గతవారం ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రపంచ ధనవంతుల జాబితాలో బెర్నార్డ్ తొలిస్థానంలో నిలవగా మస్క్ రెండో స్థానానికి పరిమితమయ్యారు. ఈ ర్యాంకులు ప్రకటించిన కొద్ది సేపటికే మస్క్ తన వ్యక్తిగత సంపద విలువను పెంచుకుని తొలిస్థానానికి చేరుకున్నారు. తాజాగా మరోసారి మస్క్ వ్యక్తిగత ఆస్తుల విలువ తగ్గడంతో ఆయన రెండో స్థానానికి దిగజారారు.






